- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యార్థులకు అలర్ట్.. ఏపీ ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే ?
ఏప్రిల్ 18 లేదా 19వ తేదీలలో ఏపీ ఇంటర్ రిజల్ట్స్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నారు అధికారులు.

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఏపీ ఇంటర్ ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇవాళ తెలంగాణ ఇంటర్ ఫలితాలు రిలీజ్ అయ్యాయి. మరో వారం రోజుల్లో ఏపీ ఫలితాలను కూడా విడుదల కానున్నాయి. అంటే దాదాపుగా ఏప్రిల్ 18 లేదా 19వ తేదీలలో ఏపీ ఇంటర్ రిజల్ట్స్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నారు అధికారులు.
ఏపీ ఇంటర్ ఫలితాలకు ముహుర్తం ఫిక్స్
ఇప్పటికే వాల్యుయేషన్ ప్రక్రియ పూర్తి చేసిన ఏపీ విద్యాశాఖ, ప్రస్తుతం ఫలితాలను విడుదల చేసేందుకు అవసరమైన తతంగం పూర్తి చేస్తోంది. ఈ నెల 16వ తేదీ నాటికి ఇంటర్ ఫలితాలకు సంబంధించిన ప్రాసెస్ మొత్తం ఫినిష్ చేసే దిశగా అడుగులు వేస్తోంది. అన్నీ కుదిరితే ఏప్రిల్ 18 లేదా 19 తేదీలలో ఇంటర్ ఫలితాలు కచ్చితంగా రిలీజ్ కానున్నాయి. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మార్చి 23వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. అయితే ఈ సారి ఇంటర్ ఫస్టియర్ కు కొన్ని మార్పులు చేశారు. అందుకే పరీక్షల నిర్వహణతో పాటు వ్యాల్యూషన్ కొంత ఆలస్యం అయిందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.






