BREAKING: ఏపీలో 31 మంది మావోయిస్టుల అరెస్టు : ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేశ్ చంద్ర

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-11-18 12:24:15  IST  )

ఆంధ్రప్రదేశ్ లో మంగళవారం ఉదయం 6.30-7 గంటల సమయంలో మారేడుమిల్లి అటవీప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ నిర్వహించినట్లు ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా తెలిపారు.

BREAKING: ఏపీలో 31 మంది మావోయిస్టుల అరెస్టు : ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేశ్ చంద్ర
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో మంగళవారం ఉదయం 6.30 -7 గంటల సమయంలో మారేడుమిల్లి అటవీప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ నిర్వహించినట్లు ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా తెలిపారు. ఎన్కౌంటర్ కు సంబంధించిన వివరాలను అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ తో కలిసి వెల్లడించారు. మారేడుమిల్లిలో జరిగిన ఎన్కౌంటర్ లో అగ్రనేత హిడ్మా సహా ఆరుగురు మరణించినట్లు తెలిపారు. ప్రస్తుతం కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోందని, ఎన్కౌంటర్లో వివిధ రకాల ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

ఉమ్మడి కృష్ణాజిల్లా విజయవాడలోని న్యూ ఆటోనగర్ లో ఓ బిల్డింగ్ లో ఉన్న మావోయిస్టులను అరెస్ట్ చేశామనన్నారు. ఇవాళ ఉదయం నుంచి కృష్ణా జిల్లాతోపాటు విజయవాడ, కాకినాడలో మొత్తం 31 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేసినట్లు ఏడీజీ మహేశ్‌చంద్ర లడ్హా తెలిపారు. వీరిలో 9 మంది కేంద్ర కమిటీ కార్యదర్శిగా చెప్పబడుతున్న దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి భద్రతా సిబ్బంది ఉన్నారని వివరించారు. అరెస్టు అయిన వారిలో 12 మంది మహిళలతోపాటు మిలిషీయా సభ్యులు, సానుభూతి పరులు ఉన్నట్లు సమాచారం. పెనమలూరు నియోజకవర్గంలోని కొత్త ఆటోనగర్‌లో పది రోజుల కిందట ఛత్తీస్‌గడ్‌కు చెందిన 27 మంది మావోయిస్టులు కార్మికుల పేరిట వచ్చి అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అరెస్టైన వారంతా ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చినవారని గుర్తించినట్లు చెప్పారు. మావోయిస్టుల నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.

రాష్ట్రంలో 60 మంది హిడ్మా టీమ్

అలాగే విజయవాడ, కాకినాడ, విజయనగరం, విశాఖ నగరాల్లో 60 మంది హిడ్మా టీమ్ ఉన్నట్లు ఇంటెలిజెన్స్ గుర్తించిందన్నారు. అక్టోబర్ 26న ఏఓబీలోకి హిడ్మా టీమ్ ఎంటరైందని తెలిపారు. ఎవరినైనా టార్గెట్ చేసి మావోయిస్టులు రెక్కీ చేశారా? విజయవాడలోని ఆటోనగర్ ని షెల్టర్ గా ఎందుకు ఎంచుకున్నారు? వీఐపీ రూట్ ను మావోయిస్టులు టార్గెట్ చేసుకున్నారా? అన్న కోణాల్లో ఇంటెలిజెన్స్ వర్గాలు దర్యాప్తు చేస్తున్నాయని మహేష్ చంద్ర తెలిపారు.


READ MORE ....

విజయవాడలో మావోయిస్టుల కలకలం.. బిల్డింగ్‍లో 10 మంది మావోయిస్టులు




Next Story