- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏసీబీ సోదాల్లో భారీగా డబ్బు, నగలు, ఆస్తులు.. ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ డిప్యూటీ చీఫ్ ఇన్ స్పెక్టర్ అరెస్ట్
భారీగా అక్రమాస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో ఏపీ పరిశ్రమలశాఖ డిప్యూటీ చీఫ్ ఇన్ స్పెక్టర్ చల్లరపు శైలేంద్ర కుమార్ ను ఏసీబీ అధికారులు శనివారం అరెస్ట్ చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: భారీగా అక్రమాస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో ఏపీ పరిశ్రమలశాఖ డిప్యూటీ చీఫ్ ఇన్ స్పెక్టర్ చల్లరపు శైలేంద్ర కుమార్ ను ఏసీబీ అధికారులు శనివారం అరెస్ట్ చేశారు. విజయవాడలో ఉన్న పరిశ్రమల శాఖ డైరెక్టర్ కార్యాలయంలో ఆయన విధులు నిర్వహిస్తున్నారు. అధికారాన్ని దుర్వినియోగం చేసి అక్రమాస్తులు కూడబెట్టారని పక్కా సమాచారం అందడంతో ఆయన ఇంటితో పాటు బంధువుల ఇళ్లు సహా ఏడు ప్రాంతాల్లో రెండ్రోజులపాటు ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఈ సోదాలలో ఇళ్లు, స్థలాలు, గోల్డ్, వెండి నగలతో పాటు.. ఇంట్లో కూడబెట్టిన భారీ నగదు, వాహనాలను గుర్తించి వాటన్నింటినీ సీజ్ చేశారు. అక్రమాస్తుల కేసులోఆయన్ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. రేపు నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలుస్తోంది.
Next Story






