- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking:‘అస్త్రం’ యాప్‌ను ప్రారంభించిన ఏపీ హోంమంత్రి
by Jakkula.Mamatha |
రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ఇటీవల ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు.

X
దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ఇటీవల ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో ఆమె రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల రక్షణ, తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే ఇవాళ(ఆదివారం) ఏపీ(Andhra Pradesh) హోంమంత్రి అనిత(Home Minister Anitha) ‘అస్త్రం’ యాప్‌ను ప్రారంభించారు. ఈ యాప్‌లో ట్రాఫిక్ పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది. విశాఖ వాసిగా ట్రాఫిక్ కష్టాలు ప్రత్యక్షంగా చూశానని ఆమె తెలిపారు. ఈ తరుణంలో పబ్లిక్ ఫ్రెండ్లీ యాప్‌ను తేవాలని ఆలోచన చేశామని అన్నారు. టెలిగ్రామ్ నుంచి యాప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 3 నెలల్లో యాప్ పూర్తిగా అందుబాటులోకి వస్తుందని హోం మంత్రి అనిత స్పష్టం చేశారు.
Next Story






