- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మానసిక రోగితో మాట్లాడలేం : జగన్ పై హోంమంత్రి అనిత సెటైర్
జగన్ పేరులో ఉన్న గన్.. రాజధాని పేరులో కూడా ఉండాలనుకుంటున్నారని, అందుకే మావిగన్ పేరుతో ప్రజలను ముంచే ఆలోచనలు చేస్తున్నారని హోంమంత్రి అనిత ఆరోపించారు.

దిశ, వెబ్‌డెస్క్: జగన్ పేరులో ఉన్న గన్.. రాజధాని పేరులో కూడా ఉండాలనుకుంటున్నారని, అందుకే మావిగన్ పేరుతో ప్రజలను ముంచే ఆలోచనలు చేస్తున్నారని హోంమంత్రి అనిత ఆరోపించారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆమె.. ప్రజల్లో అల్లకల్లోలం తీసుకొచ్చే ఆలోచనతోనే జగన్ ముందుకు వెళ్తున్నారని దుయ్యబట్టారు. రాజధానిపై రోజుకో మాట, పూటకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. అధికారంలోకి రాకముందు అమరావతి, వచ్చాక మూడు రాజధానులు, ఇప్పుడు మావిగన్ అంటూ.. రాష్ట్రానికి రాజధాని లేకుండా కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. తమ మేనిఫెస్టోలో మావిగన్ ను చేర్చి ముందుకు వెళ్తామంటున్న జగన్ కు.. ప్రతిపక్ష హోదా లేకుండా చేసినా ఇంకా బుద్ధి రాలేదన్నారు. మానసికంగా దెబ్బతిన్న రోగితో ఎంత మాట్లాడినా వేస్ట్ అన్నారు. మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వ్యాఖ్యలపైనా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా లోకానికి అమర్ నాథ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళా కమిషన్ వద్దకు వెళ్లి వచ్చాక ఆయన మహిళల గురించి ఇష్టానుసారం మాట్లాడారని మండిపడ్డారు. అలాగే అమరావతి చేసిన వ్యాఖ్యలకు కూడా ప్రజలే బుద్ధి చెప్తారని, వేచి ఉండాలని పేర్కొన్నారు.






