ఏపీ హైకోర్టు కీలక తీర్పు.. గ్రూప్‌-2 రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లు కొట్టివేత

by Kema Shiva Kumar |

ఏపీపీఎస్సీ గ్రూప్-2 సర్వీసెస్ నోటిఫికేషన్‌లో మహిళలు, దివ్యాంగులు, మాజీ సైనికులు, క్రీడాకారులకు రిజర్వేషన్లకు సంబంధించి ప్రత్యేక రోస్టర్ పాయింట్లపై దాఖలైన అనుబంధ పిటిషన్లపై ఇవాళ ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది.

ఏపీ హైకోర్టు కీలక తీర్పు.. గ్రూప్‌-2 రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లు కొట్టివేత
X

దిశ, వెబ్‌డెస్క్:ఏపీపీఎస్సీ గ్రూప్-2 సర్వీసెస్ నోటిఫికేషన్‌లో మహిళలు, దివ్యాంగులు, మాజీ సైనికులు, క్రీడాకారులకు రిజర్వేషన్లకు సంబంధించి ప్రత్యేక రోస్టర్ పాయింట్లపై దాఖలైన అనుబంధ పిటిషన్లపై ఇవాళ ఏపీ హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. ఈ మేరకు ఆ పిటిషన్లను ధర్మాసనం కొట్టివేస్తున్నట్లుగా స్పష్టం చేసింది.

కాగా, గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష 2025, ఫిబ్రవరి 23న జరగాల్సి ఉంది. డిసెంబరులో విడుదలైన నోటిఫికేషన్‌లో హారిజాంటల్ రిజర్వేషన్ పాయింట్లు (Roster Points) కేటాయించడం చట్టవిరుద్ధమని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు వ్యతిరేకమని ఆరోపిస్తూ మొత్తం నాలుగు పిటిషన్లు దాఖలయ్యాయి. ఫిబ్రవరి 20, 2025న జస్టిస్ సత్తి సుబ్బా‌రెడ్డి ఆ అనుబంధ పిటిషన్లను కొట్టివేశారు. పరీక్ష షెడ్యూల్ ప్రకారమే జరగవచ్చని, అయితే ఫలితాలు పెండింగ్‌లో ఉన్న ప్రధాన పిటిషన్ల తీర్పుకు లోబడి ఉంటాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం మరోసారి ఆ అనుబంధ పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం వాటిని కొట్టివేస్తున్నట్లుగా తీర్పును వెలువరించింది.

Next Story