- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BREAKING: లిక్కర్ కేసులో కీలక పరిణామం.. రాజ్ కేసిరెడ్డికి బెయిల్ మంజూరు
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏ1 రాజ్ కేసిరెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న రాజ్ కేసిరెడ్డికి రాష్ట్ర హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సుమారు ఏడాది నుంచి జైల్లోనే ఉంటున్న అతనికి ఈ బెయిల్ తో స్వల్ప ఊరట లభించింది. కానీ కొన్ని షరతులు విధించింది. గతేడాది ఏప్రిల్ 25న రాజ్ కేసిరెడ్డిని లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. అప్పట్నుంచీ ఆయన జ్యుడీషియల్ కస్టడీలో కొనసాగుతున్నారు. పలుమార్లు అతని లాయర్లు బెయిల్ కోసం అప్లై చేసినా కోర్టు ఆ పిటిషన్లను కొట్టివేసింది. తాజాగా బెయిల్ పిటిషన్ పై మరోసారి విచారణ చేసిన హైకోర్టు.. షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది.
ఈ కేసులో రాజ్ కేసిరెడ్డిపై మద్యం సరఫరాలో గుత్తాధిపత్యం (Monopoly), డిస్టిలరీల నుంచి ముడుపులు వసూలు చేయడం, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేలా ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కు కావడం వంటి ఆరోపణలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో మద్యం కొనుగోళ్ల ప్రక్రియను ప్రభావితం చేయడంలో ఇతని పాత్ర ఉన్నట్లు ఏసీబీ (ACB), సీఐడీ (CID) అధికారులు విచారణలో తేల్చారు. ఈ స్కామ్‌లో చాలా మంది రాజకీయ నేతలు, ఐఏఎస్ అధికారులు, డిస్టిలరీల యజమానులు నిందితులుగా ఉన్నారు. APSBCL మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి, డిస్టిలరీ యజమానులు, ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు కూడా ఉన్నారు.






