- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP High Court: ఏపీ సర్కార్‌కు హైకోర్టులో ఊరట.. డీజీపీ నియామకంపై దాఖలైన పిటిషన్ కొట్టివేత
కొత్త డీజీపీ (DGP) ఎంపికలో సుప్రీం కోర్టు ఆదేశాలు పాటించలేదని ఏపీ హైకోర్టు (High Court)లో సోమవారం లంచ్ మోషన్ పిటిషన్ (Lunch Motion Petition) దాఖలైంది.

దిశ, వెబ్‌డెస్క్: కొత్త డీజీపీ (DGP) ఎంపికలో సుప్రీం కోర్టు ఆదేశాలు పాటించలేదని ఏపీ హైకోర్టు (High Court)లో సోమవారం లంచ్ మోషన్ పిటిషన్ (Lunch Motion Petition) దాఖలైంది. ఈ మేరకు ఇవాళ ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ తీర్పును వెలువరించింది. తీర్పు విషయంలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే సుప్రీం కోర్టును ఆశ్రయించాలని కోర్టు పిటిషనీర్‌కు సూచించింది.
కాగా, ఆంధ్రప్రదేశ్ డీజీపీ (AP DGP)గా ఉన్న ద్వారకా తిరుమల రావు ఈ నెల 31న పదవీ విరమణ చేయబోతున్నారు. ఈ క్రమంలోనే అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఈ మేరకు కొత్త డీజీపీ (DGP) ఎంపికను సవాలు చేస్తూ హైకోర్టు (High Court)లో ఇవాళ లంచ్ మోషన్ పిటిషన్ (Lunch Motion Petition) దాఖలైంది. అయితే, డీజీపీ (DGP) ఎంపికలో సుప్రీం కోర్టు గైడ్‌లైన్స్ (Supreme Court Guidelines), యూపీఎస్సీ (UPSC) నిబంధనలు పాటించలేదని పిటిషన్ వేశారు. రూల్స్ మేరకు అన్ని అర్హత ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారుల లిస్ట్‌ను ప్రభుత్వం యూపీఎస్సీ (UPSC)కి రిఫర్ చేయాలని పిల్‌లో పేర్కొన్నారు. అయితే, ముగ్గురు అధికారులతో కూడా జాబితాను యూపీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వానికి పంపగా.. వారిలో ఏ ఒక్కరిని డీజీపీ (DGP)గా నియమించకుండా జూనియర్లకు ఆ పదవిని కట్టబెడుతోందని ఆరోపించించారు. ఈ నెలాఖరున ప్రస్తుత డీజీపీ ద్వారక తిరమల రావు (DGP Dwaraka Tirumala Rao) రిటైర్ అవుతున్నందున పిల్‌పై వెంటనే విచారణ జరపాలని హైకోర్టు (High Court)ను పిటిషనర్ కోరారు. ఈ మేరకు ఆ పిటిషన్‌పై ఇవాళ విచారణ చేపట్టిన ధర్మాసనం పిటిషన్‌ను కొట్టి వేస్తూ తీర్పు చెప్పింది.
తాజా సమాచారం మేరకు ఏపీ కొత్త డీపీగా హరీశ్ కుమార్ గుప్తా (Harish Kumar Guptha)ను నియమించనున్నట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. 1992 బ్యాచ్‌కు చెందిన హరీష్ కుమార్ గుప్తా ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (Vigilance and Enforcement) విభాగానికి డీజీగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా సార్వత్రిక ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆయనను రాష్ట్ర డీజీపీగా నియమించిన విషయం తెలిసిందే.






