- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పరకామణి చోరీ కేసు.. హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు
తిరుమల పరకామణి చోరీ కేసుపై గురువారం విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

X
దిశ, వెబ్‌డెస్క్: తిరుమల పరకామణి చోరీ కేసుపై గురువారం విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులై రవికుమార్ హైకోర్టు డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేయగా.. దానిపై హైకోర్టు విచారణ చేపట్టింది. పరకామణి చోరీ కేసు లోక్ అదాలత్ లో రాజీ చేయడం అంటే చిన్నవిషయం కాదని పేర్కొంది. సతీశ్ కేసును లోక్ అదాలత్ లో రాజీ చేసే అవకాశం లేదని సింగిల్ జడ్జి తెలుపగా.. అందులో తప్పేముందని ధర్మాసనం ప్రశ్నించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు ప్రాథమిక అభిప్రాయం మాత్రమేనని పేర్కొంది. ఆలయాల ప్రయోజనాలను కాపాడే విషయంలో మొదటి సంరక్షకులు కోర్టులే అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రవికుమార్ అప్పీల్ పై తదుపరి విచారణను ఈనెల 11కు వాయిదా వేసింది.
Next Story






