పరకామణి చోరీ కేసు.. సతీష్ హత్య నేపథ్యంలో హైకోర్టు కీలక ఆదేశాలు

by Naga Rani Yarlagadda |

తిరుమల పరకామణి చోరీకేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

పరకామణి చోరీ కేసు.. సతీష్ హత్య నేపథ్యంలో హైకోర్టు కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల పరకామణి చోరీకేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అప్పటి ఏవీఎస్ఓ వై. సతీష్ కుమార్ ఇటీవల హత్యకు గురైన నేపథ్యంలో.. కేసులో మిగతా సాక్షులకు, నిందితుడు రవికుమార్ కు భద్రత కల్పించాలని ఆదేశాల్లో పేర్కొంది. సతీష్ కుమార్ మరణవార్త విని షాకైనట్లు కోర్టు తెలిపింది. సీఐడీ అధికారులు కూడా కేసును దర్యాప్తు చేసేందుకు అనుమతించాలని కోరుతూ సీఐడీ మెమో దాఖలు చేసింది. సీఐడీ డీజీ అభ్యర్థన మేరకు.. దర్యాప్తుకు హైకోర్టు అంగీకరిస్తూ.. తదుపరి విచారణను డిసెంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది.

Next Story