- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP High Court: నేడు విడదల రజిని బెయిల్ పిటిషన్‌పై విచారణ.. వైసీపీ శ్రేణుల్లో టెన్షన్ టెన్షన్!
2019లో సోషల్ మీడియా (Social Media)లో పోస్టులు పెట్టి ప్రశ్నించినందుకు గాను తనను చిత్రహింసలు గురి చేశారని ఐటీడీపీ (ITDP) అధ్యక్షుడు పిల్లి కోటి (Pilli Koti), మాజీ మంత్రి విడదల రజిని (Vidadala Rajini)పై ఆరోపణలు గుప్పించారు.

దిశ, వెబ్‌డెస్క్: 2019లో సోషల్ మీడియా (Social Media)లో పోస్టులు పెట్టి ప్రశ్నించినందుకు గాను తనను చిత్రహింసలు గురి చేశారని ఐటీడీపీ (ITDP) అధ్యక్షుడు పిల్లి కోటి (Pilli Koti), మాజీ మంత్రి విడదల రజిని (Vidadala Rajini)పై ఆరోపణలు గుప్పించారు. ఆమెపై కేసు నమోదు చేయాలని గతంలో ఎన్ని సార్లు పోలీస్ స్టేషన్ (Police Station)కు వెళ్లగా ఎలాంటి స్పందన లేకపోవడంతోనే బాధితుడు కోటి చివరికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (Andhra Pradesh High Court)ను ఆశ్రయించారు.
ఈ మేరకు ఆయన పిటిషన్‌పై ఈనెల 5న విచారణ చేపట్టిన ధర్మాసనం రెండు వారాల్లోగా కేసు నమోదు చేసి వివరాలు ఇవ్వాలని పల్నాడు జిల్లా ఎస్పీ (SP)కి ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలు నేపథ్యంలో మాజీ మంత్రి విడదల రజిని (Vidadala Rajini)పై చిలకలూరిపేట (Chilakaluripeta) పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే తనపై నమోదైన కేసుల ముందస్తు బెయిల్ (Anticipatory Bail) మంజూరు చేయాలని విడదల రజిని హైకోర్టు (High Court)ను ఆశ్రయించారు. ఈ మేరకు ఇవాళ ధర్మాసనం ఆమె పిటిషన్‌పై విచారణ చేపట్టనుంది. మరోవైపు ఈ కేసులో తమ అభిమాన నాయకురాలికి కోర్టు ముందస్తు బెయిల్ ఇస్తుందా.. లేదో అన్న టెన్షన్ చిలకలూరిపేట (Chialakluripeta) వైసీపీ శ్రేణుల్లో నెలకొంది.






