ఏపీపీఎస్సీ కేసులో ఏ2 నిందితుడికి బెయిల్

by Naga Rani Yarlagadda |

ఏపీపీఎస్సీ గ్రూప్-1 (APPSC Group 1) అక్రమాల కేసులో ఏ2 నిందితుడైన మధుకు హైకోర్టు (AP High Court) బెయిల్ మంజూరు చేసింది.

ఏపీపీఎస్సీ కేసులో ఏ2 నిందితుడికి బెయిల్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీపీఎస్సీ గ్రూప్-1 (APPSC Group 1) అక్రమాల కేసులో ఏ2 నిందితుడైన మధుకు హైకోర్టు (AP High Court) బెయిల్ మంజూరు చేసింది. ఏ1గా ఉన్న పీఎస్సార్ ఆంజనేయులు ఇప్పటికే మధ్యంతర బెయిల్ పై విడుదలయ్యారు. తాజాగా మధుసూదన్ కు కూడా బెయిల్ మంజూరవ్వగా.. జైలు ఫార్మాలిటీస్ పూర్తయిన అనంతరం పోలీసులు అతడిని రిలీజ్ చేయనున్నారు. జులై 3న అతని రిమాండ్ గడువు ముగియగా.. ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ముందు బుధవారం హాజరు పరచగా.. ఈ నెల 16 వరకూ రిమాండ్ ను పొడిగించారు. నేడు బెయిల్ మంజూరవ్వడంతో మధుకు బిగ్ రిలీఫ్ దక్కింది.

Next Story