- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP High Court: కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టులో బిగ్ రిలీఫ్.. ధర్మాసనం కీలక ఆదేశాలు
by Kema Shiva Kumar |
వైసీపీ కీలక నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి (Kethireddy Peddareddy)కి హైకోర్టు (High Court)లో బిగ్ రిలీఫ్ లభించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ కీలక నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి (Kethireddy Peddareddy)కి హైకోర్టు (High Court)లో బిగ్ రిలీఫ్ లభించింది. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో తాడిపత్రి (Thadipathri)లో చెలరేగిన అల్లర్ల కారణంగా అక్కడి వెళ్లేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ క్రమంలోనే ఆయన జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy), టీడీపీ (TP) కార్యకర్తలు తన ఇంటిపై దాడికి పాల్పడ్డారని, తనను తాడిపత్రికి వెళ్లేలా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆయన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం పెద్దారెడ్డిని తాడిపత్రికి వెళ్లేందుకు షరతులతో కూడిన అనుమతిని ఇచ్చింది. ఈ మేరకు ఇవాళ ఆయన మధ్యాహ్నం తాడిపత్రికి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు.
Next Story






