ఈ జిల్లాల్లో రేపు భారీ ఉష్ణోగ్రతలు..అస్స‌లు బ‌య‌ట‌కు రావొద్దు

by velandi.Saikiran |

ఏపీ ప్ర‌జ‌లకు అలర్ట్..రేపు మాడు పగిలే ఎండలు కొడ‌తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది.

ఈ జిల్లాల్లో రేపు భారీ ఉష్ణోగ్రతలు..అస్స‌లు బ‌య‌ట‌కు రావొద్దు
X

దిశ‌, వెబ్ డెస్క్‌: రెండు తెలుగు రాష్ట్రాలలో ఎండలు దంచి కొడుతున్నాయి. 40 నుంచి 45 డిగ్రీల వరకు చాలా ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు కూడా నమోదు అవుతున్నాయి. దీంతో ఉద‌యం పది దాటిందంటే బయటకు రావడానికి జనాలు వణికిపోతున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఏపీ వాసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది విపత్తుల నిర్వహణ సంస్థ. రేపు ఎవరు కూడా బయటకు రాకూడదని కోరింది. ఏపీ వ్యాప్తంగా 43 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రేపు నమోదు అవుతాయని పేర్కొంది.

ఈ జిల్లాలకు డేంజర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మన్యం, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, మార్కాపురం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, కడప జిల్లాలో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రేపు నమోదు అవుతాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఈ జిల్లాలకు సంబంధించిన ప్రజలు ఎవరు కూడా రేపు ఉద‌యం 10 గంట‌ల‌ నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు బయటకు రాకూడదని కోరింది.

అత్యవసరం అయితే తప్ప, బయట అడుగుపెట్టకూడదని వెల్లడించింది. చిన్నపిల్లలు, వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవాలని పేర్కొంది. ఇక ఏపీ వ్యాప్తంగా 38 మండలాలలో రేపు తీవ్ర వడగాలులు, 67 మండలాలలో వడగాలులు వీచే ప్రమాదం పొంచి ఉన్నట్లు పేర్కొంది. ఇక బుధవారం రోజున నంద్యాలలోని సంజామల ప్రాంతంలో 44.6 డిగ్రీలు, పల్నాడులోని గురజాలలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.

Next Story