అమరావతిని చట్టబద్దత చేయండి: కేంద్రానికి ఏపీ ప్రభుత్వం లేఖ

by Vemula.Srinu Prasad |

అమరావతిని చట్టబద్దత చేయండని కేంద్రానికి ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది...

అమరావతిని చట్టబద్దత చేయండి: కేంద్రానికి ఏపీ ప్రభుత్వం లేఖ
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజధాని అమరావతి(Amaravati)ని చట్టబద్ధత చేయాలని ప్రభుత్వం కృషి చేస్తు్న్న విషయం తెలిసిందే. ఈ మేరకు తాజాగా కేంద్రానికి ప్రభుత్వం(Government) లేఖ రాసింది. విభజన చట్టం(Partition Law)లోని సెక్షన్ 5(2)ను సవరించాలని కోరింది. 2014 నుంచి 2024 వరకు ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌గా ఉన్న విషయాన్ని లేఖలో ప్రభుత్వం తెలిపింది. అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ చట్టబద్ధతకు సంబంధించి కేంద్రం కసరత్తు చేయాలని విజ్ఞప్తి చేసింది. అవకాశం ఉంటే ఈ పార్లమెంట్‌ సమావేశాల్లోనే బిల్లు పెట్టాలని కోరింది. అయితే కేంద్రమంత్రి వర్గంలో చర్చించిన తర్వాత పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story