డ్రైవ‌ర్ సుబ్ర‌మ‌ణ్యం హ‌త్య కేసు.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

by Ajay Maddhiboyina |

డ్రైవ‌ర్ సుబ్ర‌మ‌ణ్యం హ‌త్య కేసు.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో సంచలనం సృష్టించిన డ్రైవ‌ర్ సుభ్ర‌మ‌ణ్యం హ‌త్య‌కేసుపై ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్రాసిక్యూష‌న్ స‌హాయం చేసేందుకు ప్ర‌త్యేక న్యాయ‌వాదిగా ముప్పాళ్ల సుబ్బారావును నియ‌మిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. కాకినాడ‌కు చెందిన సుబ్ర‌మ‌ణ్యం అనే యువ‌కుడు వైసీపీ నేత అనంత‌బాబు వద్ద కారు డ్రైవ‌ర్‌గా పనిచేసేవాడు. సుబ్రహ్మణ్యం హత్యకు గురవ్వడంతో పాటూ డెబ్ బాడీని అతడి ఇంటికి తీసుకువచ్చి వదిలేసారు.

అనంతబాబే ఈ హత్య చేయించి, డోర్ డెలివరీ చేయించారని అప్పట్లో పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. కానీ వైసీపీ అధికారంలో ఉండటంతో నింధితులకు శిక్ష పడకుండా కాపాడారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఈ కేసును ప్రత్యేక కేసుగా పరిగణించింది. ఇదే కేసులో బాధితుల తరఫున గతంలో ఫైట్ చేసిన ముప్పాళ్ల సుబ్బారావును ప్రత్యేక న్యాయవాదిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Next Story