- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రతి మసీదుకు నెలకు రూ.5వేలు..ఏపీ సర్కార్ ప్రకటన !
ఏపీలోని ప్రతి మసీదుకు నెలకు రూ. 5000 ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు.

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మైనారిటీలకు అదిరిపోయే శుభవార్త అందింది. ఏపీలోని ప్రతి మసీదుకు నెలకు రూ. 5000 ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. మైనారిటీ సంక్షేమ దినోత్సవ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఏపీలో ఉన్న మైనారిటీ ఆడబిడ్డలకు ఇంటర్మీడియట్ వరకు ఉచిత విద్య అందిస్తామని వెల్లడించారు. ఇమామ్, మౌజంలకు పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లిస్తామని కూడా హామీ ఇచ్చారు.
ప్రతి మసీదుకు త్వరలోనే నెలకు రూ.5000 అందిస్తామని కీలక ప్రకటన చేశారు. వక్ఫ్ బోర్డ్ చట్ట సవరణ చేసినప్పటికీ మైనారిటీల ద్వారానే ఆస్తుల సంరక్షణ చేస్తామని వెల్లడించారు నారా చంద్రబాబు నాయుడు. వక్ఫ్ ఆస్తులను డిజిటలైజ్ చేసి, అందరూ పరిశీలించేలా చేస్తామని కూడా భరోసా నింపారు. మైనారిటీలకు ఎలాంటి కష్టం వచ్చినా తమ ప్రభుత్వం ఆదుకుంటుందని ప్రకటించారు. ఈ విషయంలో ముస్లింలు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు.






