- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్రామ సభలపై ఏపీ కీలక నిర్ణయం..ఇక ఆ సమస్యలకు చెక్
ఈ నెల 24వ తేదీన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గ్రామ పంచాయతీలలో ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది సర్కార్.

దిశ, వెబ్ డెస్క్: గ్రామ సభల నిర్వహణపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఈ నెల 24వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలలో ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది సర్కార్. ఈ మేరకు గ్రామ, మండల, జిల్లా స్థాయి లో తగిన విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ అడిషనల్ కమిషనర్ సుధాకర్ రావు ఉత్తర్వులు ఇష్యూ చేశారు.
ముందుగానే సమాచారం ఇచ్చి అన్ని శాఖల అధికారులు, ప్రజలు గ్రామ సభకు హాజరు అయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ గ్రామ సభల నిర్వహణ పూర్తి బాధ్యత జెడ్పీ సీఈవోలు, డీపీఓలు తీసుకోవాలన్నారు. ఈ గ్రామ సభల నిర్వహణ ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకోవాలని స్పష్టం చేశారు. పాలనను మరింత ప్రజలకు దగ్గర చేసేందుకే వీటిని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామ సభల నిర్వహణ విజయవంతం చేయాలని ఈ దేశానిర్దేశం చేశారు.






