- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. డబ్బుల చెల్లింపుపై కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) రాష్ట్ర విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఏపీ ఫీజ్ రియంబర్స్‌మెంట్ విషయంలో కూటమి ప్రభుత్వం కీలక

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) రాష్ట్ర విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఏపీ ఫీజ్ రియంబర్స్‌మెంట్ విషయంలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాత బకాయిల చెల్లింపు విషయంలో... ప్రత్యేకంగా ఓ కమిటీని వేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఇక ఈ కమిటీ.. ఫీజ్ రియంబర్స్‌మెంట్ ( Fee reimbursement ) విషయంలో.. ప్రత్యేక నివేదిక తయారు చేయనుంది. ఆ నివేదిక ప్రకారం... కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్లనుంది. 2024 - 2025 విద్యా సంవత్సరం నుంచి ఫేషియల్ రికగ్నిషన్ ( Facial recognition)... ద్వారా హాజరును మాత్రమే... పరిగణలోకి తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అలాంటి కాలేజీల ఖాతాలలోకి డబ్బులు ( Cash) జమ చేస్తారని అధికారులు చెబుతున్నారు. గత ప్రభుత్వంలో తల్లుల ఖాతాలలో జమ చేసే విధానంలో సమస్యలు తలెత్తిన సంగతి తెలిసిందే. అందుకే ఫేషియల్ రికగ్నిషన్ హాజరును తీసుకువచ్చారు. ఈ కొత్త సిస్టం ద్వారా విద్యార్థులకు అలాగే కాలేజీ యాజమాన్యాలకు... లాభం చేకూరుతుందని చెబుతున్నారు. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అయితే ఈ కమిటీ అతి త్వరలోనే నివేదిక ఇస్తుందని చెబుతున్నారు. పది రోజుల్లోనే నివేదిక వస్తుందని అంటున్నారు. ఈ నివేదిక రాగానే డబ్బులు జమ అవుతాయని సమాచారం అందుతోంది.






