- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్లకు ప్రభుత్వం అనుమతి
ఏపీ ప్రభుత్వం(AP Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ ప్రభుత్వం(AP Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఏడు నగరాల్లో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ల(Smart Street Vending Markets) ఏర్పాటుకు అనుమతినిచ్చింది. పట్టణాల్లోని వీధి వ్యాపారాలు, స్వయం సహాయక మహిళా సంఘాల మహిళలకు ఈ స్మార్ట్ వెండింగ్ మార్కెట్ల ద్వారా ఉపాధి కల్పించనున్నారు. అయితే ఇటీవల నెల్లూరు జిల్లా మైపాడు బీచ్ రోడ్డులో ఏర్పాటు చేసిన స్మార్ట్ వెండింగ్ మార్కెట్ కు విపరీతమైన స్పందన రావడంతో.. రాష్ట్రంలో మరిన్ని మార్కెట్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మెప్మా(MEPMA) ద్వారా ఎంపిక చేసిన 7 పట్టణ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు.
కర్నూలు, అనంతపురం, తాడేపల్లి-మంగళగిరి, శ్రీకాకుళం, ఒంగోలు, విజయవాడ, కడప జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఆయా పట్టణాల్లోని వీధి వ్యాపారరులకు, మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా అవసరమైన ఋణం కూడా ఇప్పించనున్నారు. ఈ ఏడు నగరాల్లో 200 వరకు స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్లను వారికి అందించనున్నారు.






