మహిళా ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్!

by Ajay Maddhiboyina |

మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. మాతృత్వ సెల‌వుల‌ను పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌స్తుతం 120 రోజులు మెట‌ర్నిటీ సెలవులు ఇస్తున్నారు.

మహిళా ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్!
X

దిశ‌, వెబ్ డెస్క్: మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. మాతృత్వ సెల‌వుల‌ను పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌స్తుతం 120 రోజులు మెట‌ర్నిటీ సెలవులు ఇస్తున్నారు. కాగా తాజాగా వాటిని 180 రోజులకి పెంచుతూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. గతంలో ఇద్దరు పిల్లలకు మాత్రమే ప్రసూతి సెలవులు వర్తించేవి. కానీ తాజా జీవోలో ఆ కండిషన్ కూడా తీసేసింది.

ఎంతమంది పిల్లలను కన్నా యతావిథిగా సెలవులు వర్తిస్తాయని పేర్కొంది. గతంలో ఉన్న రూల్స్ తొలగించి తక్షణమే ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే కూటమి సర్కార్ అధికారంలోకి వస్తే మెటర్నిటీ సెలవులు పెంచుతామని కూటమి అసెంబ్లీ ఎన్నికల మందు ప్రకటించింది. చాలా కాలం నుండి ఈ డిమాండ్ ఉండటంతో ప్రభుత్వం సెలవులు పెంచింది. మహిళలు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story