ఆ ఉద్యోగుల‌కు గుడ్ న్యూస్‌, పెయిడ్ లీవ్ ఇస్తూ ఏపీ స‌ర్కార్ నిర్ణయం

by velandi.Saikiran |

సరిహద్దు జిల్లాలు తిరుపతి, కాకినాడ, కోనసీమ, చిత్తూరు జిల్లాలలో పనిచేస్తున్న ఉద్యోగులకు పోలింగ్ రోజున పెయిడ్ లీవ్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది ఏపీ.

ఆ ఉద్యోగుల‌కు గుడ్ న్యూస్‌, పెయిడ్ లీవ్ ఇస్తూ ఏపీ స‌ర్కార్ నిర్ణయం
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఏపీలోని కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర రాష్ట్రాలలో ఉన్న ఉద్యోగులకు పోలింగ్ రోజున పెయిడ్ లీవ్ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రాలకు సంబంధించిన ఓటర్లకు ఊరట ఇస్తూ పెయిడ్ లీవ్ ఇచ్చింది ఏపీలోని కూటమి సర్కార్.

సరిహద్దు జిల్లాలు తిరుపతి, కాకినాడ, కోనసీమ, చిత్తూరు జిల్లాలలో పనిచేస్తున్న ఉద్యోగులకు పోలింగ్ రోజున పెయిడ్ లీవ్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, దుకాణాలు, పరిశ్రమల ఉద్యోగులు, రోజువారి కూలీలు ఈ సదుపాయం పొందనున్నారు. ఈ ఇతర రాష్ట్రాల ఓటర్లు.. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడంటే ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరిహద్దులో పుదుచ్చేరి అలాగే తమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయి. ఇందులో పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 19వ తేదీన జరుగుతాయి. అటు తమిళనాడు రాష్ట్రంలో 23వ తేదీన ఎన్నికలు ఉన్నాయి. ఈ రాష్ట్రాలకు సంబంధించిన చాలా మంది ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్నారు. తాజాగా పెయిడ్ లీవ్ ఇచ్చిన నేపథ్యంలో ఉద్యోగులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు.

Next Story