బనకచర్ల ప్రాజెక్ట్‌పై ఏపీ సర్కార్ ముందడుగు.. కేంద్రం ముందుకు ప్రతిపాదనలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-06-02 07:17:59  IST  )

బనకచర్ల (Banakacharla) ప్రాజెక్ట్‌పై తెలంగాణ సర్కార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది.

బనకచర్ల ప్రాజెక్ట్‌పై ఏపీ సర్కార్ ముందడుగు.. కేంద్రం ముందుకు ప్రతిపాదనలు
X

దిశ, వెబ్‌డెస్క్: బనకచర్ల (Banakacharla) ప్రాజెక్ట్‌పై తెలంగాణ సర్కార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ మేరకు పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం ముందుకు ఏపీ ప్రభుత్వం (AP Government) తీసుకెళ్లనుంది. ఇవాళ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన సమావేశంలో పోలవరం-బనకచర్ల రివల్ లింక్ ప్రాజక్ట్‌ డీపీఆర్‌ (DPR)పై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సమావేశంలో ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శి పీయూశ్ (Piyush), జల వనరుల శాఖ సలహాదారు వెంకటేశ్వర రావు (Venkateshwar Rao)తో పాటు పోలవరం చీఫ్ ఇంజినీర్ నరసింహ మూర్తి (Narasimha Murthy) పాల్గొన్నారు. అదేవిధంగా రాష్ట్ర నీటి పారుదల శాఖ అధికారులు బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖకు నివేదకను సమర్పించనున్నారు. సమారు రూ.81 వేల కోట్లతో ‘పోలవరం-బనకచర్ల’ ప్రాజెక్టుకు ప్రభుత్వం ప్రతిపాదించనుంది. ప్రాజెక్ట్ నిర్మాణంతో రైతులు, ప్రజలకు కలిగే ప్రయోజనాలను రాష్ట్ర నీటి పారుదల శాఖ అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ ద్వారా ఇవాళ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన సమావేశంలో వారికి సమగ్రంగా వివరించనున్నారు.

బనకచర్లపై కేంద్రానికి మా అభ్యంతరం చెప్పాం.. రేవంత్

ఏపీ ప్రభుత్వం పోలవరం-బనకచర్ల ప్రాజెక్ నిర్మాణానికి ఏపీ సర్కార్ జెట్ స్పీడ్‌లో దూసుకెళ్తుండా.. మరోవైపు ఆ ప్రాజెక్ట్‌పై తెలంగాణ సర్కార్ (Telangana Government) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బనకచర్ల ప్రాజెక్ట్‌పై కేంద్రానికి తమ అభ్యతరం చెప్పామని అన్నారు. ఆ విషయంలో తప్పకుండా జోక్యం చేసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. తెలంగాణలో గోదావరిపై ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపులే జరగలేదని కామెంట్ చేశారు ఒక వేళ తమకు కేటాయింపులు జరిగాకే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాల్సి ఉంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లలో కృష్ణా జలాలను అక్రమంగా ఏపీ మలుపుకుందని.. ఇప్పుడు ఉన్న సమస్యలే భవిష్యత్తులో గోదావరి విషయంలో వస్తాయని అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం చెప్పిన అభ్యంతరాలను ఉపసంహరించుకోవాలి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Next Story
null