ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. రూ.100కే వారసత్వ భూముల రిజిస్ట్రేషన్

by Kema Shiva Kumar |

రైతన్నలకు కూటమి ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది.

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. రూ.100కే వారసత్వ భూముల రిజిస్ట్రేషన్
X

దిశ, వెబ్‌డెస్క్: రైతన్నలకు కూటమి ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. వారసత్వ వ్యవసాయ భూములకు కుటుంబ సభ్యుల మధ్య భాగపంపిణీ ఒప్పందాల రిజిస్ట్రేషన్ ఫీజుల విషయంలో కీలక మార్పులు చేసింది. ఇక నుంచి ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ రూ.10 లక్షల లోపు ఉంటే స్టాంపు డ్యూటీగా రూ.100 చెల్లిస్తే సరిపోతుంది. రూ.10 లక్షల పైగా ఉంటే రూ.1,000 చెల్లించాలి. తమ ఆస్తులకు వీలునామా రాయకుండా కుటుంబ పెద్ద మరణిస్తే, ఆయన ఆస్తులను భార్య, పిల్లలు భాగపంపిణీ చేసుకుంటారు. ఇలాంటి కేసులకే ప్రస్తుత ఉత్తర్వులు వర్తిస్తాయని, అది కూడా వ్యవసాయ భూములకు మాత్రమేనని ప్రభుత్వం తాజా జీవోను విడుదల చేసింది. ఈ నిర్ణయంతో రైతులు వారసత్వంగా సంక్రమించిన వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆటో మ్యూటేషన్ జరుగుతుంది. వారికి పట్టాదారు పాస్ బుక్కులతో పూర్తి హక్కులు లభించనున్నాయి.

Next Story