- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఈనెలాఖరు నుంచి సమగ్ర కుటుంబ సర్వే
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఈనెలాఖరు నుంచి సమగ్ర కుటుంబ సర్వే

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం(NDA Govt) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరు నుంచి సమగ్ర కుటుంబ సర్వే(Survey) నిర్వహించాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి సంబంధించిన వివరాలు సేకరించనుంది. ప్రత్యేక మొబైల్ యాప్ సహాయంతో ఈ సమగ్ర కుటుంబ సర్వే చేయనుంది. ఈ సర్వే నిర్వహించడం ద్వారా భవిష్యత్తు సంక్షేమ కార్యక్రమాల రూపకల్పనను మెరుగుపరచడానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ సిబ్బంది ఈ సర్వేను ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ ద్వారా నిర్వహించనున్నారు. తద్వారా సమాచారం త్వరగా, ఖచ్చితంగా నమోదు చేయనున్నారు. సాధ్యమైన ప్రాంతాల్లో ఇప్పటికే నమోదైన రికార్డులను, సమాధానాలను ముందస్తుగా పూర్తి చేయడానికి ఉపయోగిస్తారు. తద్వారా ప్రతి కుటుంబానికి పట్టే సమయం తగ్గనుంది. ఆధార్ ప్రామాణీకరణను ఉపయోగించి గుర్తింపు ధ్రువీకరణను సురక్షితంగా నిర్వహిస్తారు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుతూ రికార్డులు సరైనవని నిర్దారించనుంది. ప్రభుత్వ పాలన మరింత పారదర్శకంగా పని చేసేందుకు ఈ సర్వే ఉపయోగపడనుందని ప్రభుత్వం భావిస్తోంది.






