- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మెగా డీఎస్సీ గడువు పొడిగింపుపై ఏపీ సర్కార్ కీలక ప్రకటన !
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు అంతా మెగా డీఎస్సీ గురించి చర్చ జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ మెగా

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు అంతా మెగా డీఎస్సీ గురించి చర్చ జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ మెగా డీఎస్సీ నిర్వహించేందుకు కంకణం కట్టుకుంది. ఈ నేపథ్యంలోనే.. 16,347 టీచర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ... నిన్నటితో ముగిసిన సంగతి తెలిసిందే. ఇక జూన్ 6వ తేదీ నుంచి పరీక్షలు జరగబోతున్నట్లు ఇప్పటికే షెడ్యూల్ ఫైనల్ కూడా అయింది.
కానీ... చాలా మంది 90 రోజుల పాటు ఈ పరీక్షలకు ప్రిపేర్ కావడానికి సమయం కావాలని అడుగుతున్నారు. నిరుద్యోగుల నుంచి.. మెగా డీఎస్సీ ప్రకటన చేసినప్పటి నుంచి ఇదే డిమాండ్ వినిపిస్తోంది. కానీ దీనిపై ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు. అయితే తాజాగా మెగా డీఎస్సీ గడువు పొడగింపు పై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు.
మెగా డీఎస్సీ ని ఆపడానికి వైసీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. కొంత మంది టైం పెంచాలని కోరుతున్న మాట వాస్తవమేనని వివరించారు. సిలబస్ ను మేము డిసెంబర్ నెలలోనే ఇచ్చేసామని... ఆ గడువు ఏడు నెలలు పూర్తయిందని గుర్తు చేశారు. ఇక నారా లోకేష్ వ్యాఖ్యలతో... మెగా డీఎస్సీ గడువు పెంపు లేదని క్లారిటీ వచ్చేసింది. దీంతో అభ్యర్థులకు కాస్త నిరాశ ఎదురయింది. ఉన్న సమయంలోనే పూర్తిగా చదువుకోవాలి.






