కొత్త జిల్లాలపై ఏపీ సర్కార్ కసరత్తు.. 26 నుంచి 32కు పెరిగే చాన్స్!

by Kema Shiva Kumar |

కూటమి సర్కార్ కొత్త జిల్లాల ఏర్పాటుపై ఫోకస్ పెట్టింది.

కొత్త జిల్లాలపై ఏపీ సర్కార్ కసరత్తు.. 26 నుంచి 32కు పెరిగే చాన్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: కూటమి సర్కార్ కొత్త జిల్లాల ఏర్పాటుపై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ (Cabinet Sub Committe)ని ఏర్పాటు చేసింది. జిల్లాల ఏర్పాటుపై ప్రజలకు నుంచి వచ్చిన విజ్ఞప్తులు, ఫిర్యాదులను రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ (Anagani Satya Prasad) ఆధ్వర్యంలోని కమిటీ పరిశీలిస్తోంది. అదేవిధంగా జిల్లాల పేర్ల మార్పు, కొత్త మండలాల ఏర్పాటుపై డిసెంబర్‌లోపు వర్కవుట్ పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు (CM Chandrababu) మంత్రివర్గ ఉప సంఘానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 26 జిల్లాలు ఉండగా.. ఆ సంఖ్య 32కు చేరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కృష్ణా జిల్లా నుంచి పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాలను ఎన్టీఆర్‌ జిల్లాలోకి మార్చే ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం. అదేవిధంగా అద్దంకి, కందుకూరు నియోజకవర్గాలు మళ్లీ ప్రకాశం జిల్లాలోకి మార్చే ఆలోచన కూడా చేస్తున్నారు. కొత్తగా మార్కాపురం, అమరావతి, గూడూరు, ఆదోని, పలాస, మదనపల్లి జిల్లాలుగా ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా ప్రజలకు జిల్లా కేంద్రాల దూరం తగ్గించడం, పరిపాలనా సౌలభ్యం కోసమే కూటమి సర్కార్ కొత్త జిల్లాల ఏర్పాటుకు పూనుకుంది.

ఇక రాజధాని అమరావతి (Amaravati)ని జిల్లాగా ప్రకటించడంతో ఆ ప్రాంత అభివృద్ధికి మరింత ప్రాధాన్యత లభిస్తుందని సీఎం చంద్రబాబు (CM Chandrababu) భావిస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలోని మార్కాపురం కేంద్రంగా, ఉమ్మడి అనంతపురం జిల్లాలో హిందూపురం కేంద్రంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని బలమైన డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ఆ అభ్యర్థలను కేబినెట్ సబ్ కమిటీ పరిశీలిస్తున్నటుగా తెలుస్తోంది. అన్నమయ్య జిల్లాకు రాయచోటి కాకుండా రాజంపేటను జిల్లా కేంద్రం‌గా చేయాలని ప్రజల నుంచి విజ్ఞప్తులు అందుతుండగా.. మరికొందరు రాయచోటినే కొన సాగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఏలూరు జిల్లా పరిధిలో ఉన్న నూజివీడు, కైకలూరు నియోజకవర్గాలను తిరిగి కృష్ణా జిల్లాలోనే ఉంచాలని డిమాండ్లను కూడా కేబినెట్ సబ్ కమిటీ పరిగణలోకి తీసుకున్నటుగా తెలుస్తోంది.

Next Story