- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్ర రైతులకు శుభవార్త..నేడు అకౌంట్లలోకి డబ్బులు
పోలవరం ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన రైతుల ఖాతాలలో ఇవాళ దాదాపు రూ. 250 కోట్లు జమ చేయనుంది కూటమి సర్కార్.

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు అదిరిపోయే శుభవార్త అందింది. ఇవాళ రైతుల ఖాతాలలో డబ్బులు వేసేందుకు చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుంది. పోలవరం ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన రైతుల ఖాతాలలో ఇవాళ దాదాపు రూ. 250 కోట్లు జమ చేయనుంది కూటమి సర్కార్. ఉగాది పండగ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు నేడు కొంతమంది నిర్వాసితులకు ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో చెక్కులు పంపిణీ చేయనున్నారు.
ఈ రైతులకు గత సంవత్సరం సంక్రాంతికి రూ. 980 కోట్లు, దీపావళికి రూ. 1000 కోట్లు ఇచ్చినట్లు స్పష్టం చేస్తోంది సర్కార్. 2016లో తాము రూ. 700 కోట్లు ఇవ్వగా... వైసీపీ సర్కార్ వచ్చిన తర్వాత ఈ బాధిత రైతులకు ఒక్క రూపాయి చెల్లించలేదని ఆరోపణలు చేస్తోంది. మళ్లీ తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన రైతులకు న్యాయం జరుగుతోందని వెల్లడిస్తోంది చంద్రబాబు నాయుడు కూటమి సర్కార్. తమది రైతు ప్రభుత్వమని, రైతులకు ఏ కష్టం వచ్చినా, తీర్చుతామని పేర్కొంది.






