- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీ..CRDAకు కొత్త కమిషనర్
by velandi.Saikiran |
సీఆర్డీఏ కొత్త కమిషనర్ గా విజయ రామ రాజును నియామకం చేసింది కూటమి సర్కార్. కన్నబాబును పౌరసరఫరాల కమిషనర్ గా నియమించింది.

X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం రాత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ కీలక ప్రకటన చేసింది సర్కార్. ఈ నేపథ్యంలోనే సీఆర్డీఏ కొత్త కమిషనర్ గా విజయ రామ రాజును నియామకం చేసింది కూటమి సర్కార్. ఇక సీఆర్డీఏ కమిషనర్ గా కన్నబాబును పౌరసరఫరాల కమిషనర్ గా నియమించింది.
అటు ఇప్పటి వరకు పౌరసరఫరాల శాఖ కమిషనర్ గా ఉన్న సౌరబ్ గౌర్ ను రిలీవ్ చేసింది సర్కార్. అదే సమయంలో రవి సుభాష్ కు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ పూర్తి అదనపు బాధ్యతలను చంద్రబాబు నాయుడు సర్కార్ అప్పగించింది. అంతేకాదు, మార్కాపురం కలెక్టర్ గా విజయ సునీత నియామకం కాగా, పోలవరం కలెక్టర్ గా దినేష్ కుమార్ నియమితులు అయ్యారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్.
Next Story






