- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
New Ration Cards: గుడ్ న్యూస్.. ఏపీలో కొత్త రేషన్ కార్డులు.. ఎల్లుండి నుంచే దరఖాస్తులు
ఏపీ ప్రజలకు సర్కార్ గుడ్ న్యూస్ (AP Government) చెప్పింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి కొత్త రేషన్ కార్డులకు (New Ration Cards) దరఖాస్తులు స్వీకరించనుంది.

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ప్రజలకు సర్కార్ గుడ్ న్యూస్ (AP Government) చెప్పింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి కొత్త రేషన్ కార్డులకు (New Ration Cards) దరఖాస్తులు స్వీకరించనుంది. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు ఇతర సర్వీసులకు కూడా అవకాశం కల్పించనుంది. డిసెంబర్ 2 నుంచి 28వ తేదీ వరకూ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇందుకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించనుంది. మార్పులు, చేర్పులు చేసిన కార్డులు, కొత్త కార్డులన్నింటినీ.. సంక్రాంతి (Sankranti 2025) కానుకగా లబ్ధిదారులకు అందించేలా ప్లాన్ చేసింది.
గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో.. కొత్తగా పెళ్లిళ్లు అయినవారు, రాజకీయాల కారణాలతో రేషన్ కార్డులు రానివారు వేల సంఖ్యలో ఎదురుచూస్తున్నారు. కొత్త రేషన్ కార్డులు, కార్డుల్లో మార్పులు, సభ్యుల తొలగింపు.. ఇలా అన్నీ కలిపి ప్రస్తుతం 3,36,72000 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. కొత్త దరఖాస్తులతో పాటు వీటిని కూడా పరిశీలించి కొత్త రేషన్ కార్డు్ల్ని అందించనుంది కూటమి ప్రభుత్వం.






