ఏపీలో ఉచితంగా గుండెపోటు నుండి కాపాడే ఇంజక్షన్!

by Ajay Maddhiboyina |

గుండెపోటు బాధితుల ప్రాణాలను కాపాడేందుకు టెనెక్టిప్లేస్ సూది మందును ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.

ఏపీలో ఉచితంగా గుండెపోటు నుండి కాపాడే ఇంజక్షన్!
X

దిశ, వెబ్ డెస్క్: గుండెపోటు బాధితుల ప్రాణాలను కాపాడేందుకు టెనెక్టిప్లేస్ సూది మందును ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఈ ఇంజెక్షన్ ద్వారా చాలా మంది ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. గుండెపోటు వచ్చిన వెంటనే ఆసుపత్రికి తీసుకువస్తే, ఈ సూది మందు ఇచ్చి ప్రాణాలు కాపాడుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా కమ్యూనిటీ ఆసుపత్రుల్లో ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంటే ఎంతో మందికి ఉపయోగకరంగా ఉంటుంది.

ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుతో మరణిస్తున్న సంగతి తెలిసిందే. చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు ఉన్నట్టుండి గుండెపోటుతో మరణిస్తున్నారు. గుండెపోటు వచ్చిన వెంటనే ఆస్పత్రులకు వెళితే టెనెక్టిప్లేస్ ఇంజక్షన్ ఇస్తారు. అయితే ఇది చాలా ఖరీదైనది కావడంతో కేవలం ప్రైవేటులోనే అందుబాటులో ఉంది. దీంతో పేదలు చికిత్స తీసుకోలేక చనిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో ఇకపై పేదలకు కూడా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ ఇంజక్షన్ అందుబాటులో ఉండనుంది.

Next Story