- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం...ఇక నకిలీ మద్యానికి చెక్...!
నకిలీ మద్యం బెడదను అడ్డుకట్ట వేసేందుకు ఎక్సైజ్ సురక్ష యాప్ ను ( AP Excise Suraksha APP) తాజాగా ప్రారంభించారు సీఎం

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నకిలీ మద్యానికి చెక్ పెట్టేందుకు చర్యలు చేపట్టింది చంద్రబాబు కూటమి ప్రభుత్వం. ఇందులో భాగంగానే సరికొత్త యాప్ తీసుకువచ్చింది. నకిలీ మద్యం బెడదకు అడ్డుకట్ట వేసేందుకు ఎక్సైజ్ సురక్ష యాప్ ను ( AP Excise Suraksha APP) తాజాగా ప్రారంభించారు సీఎం చంద్రబాబు. ఈ యాప్ తో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలోనే కొనుగోలు చేసిన మద్యం అసలుదా ? లేదా నకిలీదా ? అని మందుబాబులకు వెంటనే తెలిసిపోతుంది. తద్వారా కల్తీ దందాకు కూటమి ప్రభుత్వం చెక్ పెట్టనుంది. దీంతో ఇకపై ప్రతి మద్యం బాటిల్ పై క్యూఆర్ స్కాన్ తప్పని సరి చేయాలని నిబంధన కూడా పెట్టింది. ఎక్సైజ్ సురక్ష యాప్ ను ఎలా వాడాలి? అనే విషయం జనాల్లోకి తీసుకు వెళ్లేలాగా చర్యలు తీసుకోవాలని సర్కార్ ఆదేశాలు ఇచ్చింది. ఇందులో భాగంగా బార్లు, వైన్స్ దగ్గర యాప్ వివరాల బోర్డులు ఏర్పాటు చేయాలని పేర్కొంది.






