- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ, తెలంగాణ పురాతన వస్తువుల విభజనపై కీలక అడుగు
తెలుగు రాష్ట్రాల పురాతన వస్తువుల విభజనపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు వేసింది....

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ మ్యూజియం(Telangana Museum)లో ఉంచిన పురాతన వస్తువుల విభజనపై ఏపీ ప్రభుత్వం(AP Govt) ఫోకస్ పెట్టింది. ఇందుకోసం కమిటీని ఏర్పాటు చేసింది. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం -2014(AP Reorganization Act -2014) నిబంధనల ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య వస్తువుల పంపకానికి 8 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
కమిటీ ఛైర్ పర్సన్‌గా తేజస్వీ పొడపాటి
ఈ కమిటీ ఛైర్ పర్సన్‌గా రాష్ట్ర సృజనాత్మక ,సాంస్కృతిక కమిషన్ ఛైర్ పర్సన్ తేజస్వీ పొడపాటి, కన్వీనర్ గా పురావస్తు, మ్యూజియం శాఖ కమిషనర్ ను ప్రభుత్వం నియమించింది. కమిటీలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చరిత్ర విభాగ విశ్రాంత హెచ్ వోడీ ప్రొఫెసర్ వకులా భరణం రామకృష్ణ తో పాటు పురావస్తు శాఖ, మ్యూజియంలో ఉన్నత హోదాల్లో పనిచేసి పదవీ విరమణ చేసిన పలువురు అధికారులను నియమించింది. పురాతన వస్తువుల విభజన కోసం తెలంగాణ రాష్ట్ర కమిటీలతో ఈ కమిటీ సమావేశం కానుంది. రాష్ట్రానికి చెందిన పురాతన వస్తువులను గుర్తింపు, ఎంపిక, పర్యవేక్షణ, పంపిణీ కి చర్యలు, పురాతన వస్తువులను రాష్ట్రానికి బదిలీ చేయడం సహా మ్యూజియంలో భద్ర పరిచే చర్యలను కమిటీ తీసుకోనుంది. తదుపరి చర్యలు తీసుకోవాలని పురావస్తు , మ్యూజియం ల కమిషనర్‌కు పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు.






