గోదావరి పుష్కరాలపై.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

by Vemula.Srinu Prasad |

రాష్ట్రంలో వచ్చే ఏడాదిలో గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. దీంతో ఇప్పటినుంచే ప్రభుత్వం దృష్టి సారించింది...

గోదావరి పుష్కరాలపై.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో వచ్చే ఏడాదిలో గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. దీంతో ఇప్పటినుంచే ప్రభుత్వం దృష్టి సారించింది. గత అనుభవాల దృష్ట్యా ఈసారి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా కాలుష్య నియంత్రణను సీరియస్‌గా తీసుకుంది. క్లీన్ అండ్ గ్రీన్ నెస్ లో నిర్వహించాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గోదావరి ప్రాంత ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాన్ని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తోంది. సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తోంది. గోదావరి పుష్కరాలపై దిశానిర్దేశం చేస్తోంది.

గోదావరి పుష్కరాలు-2027పై కీలక నిర్ణయం

అయితే తాజాగా గోదావరి పుష్కరాలు-2027(Godavari Pushkarams – 2027)పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గోదావరి సహా ప్రధాన నదుల కాలుష్య నియంత్రణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. పవన్ కల్యాణ్ ఆదేశాలతోపర్యావరణ, ఆటవీ శాఖ ఆధ్వర్యంలో ఈ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అలాగే నదుల కాలుష్య నివారణపై కార్యచరణ సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించినట్లు సమాచారం. వివిధ శాఖల హెచ్‌వోడీలకు నోడల్ అధికారులుగా బాధ్యతలుగా ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. దీంతో నదులు కాలుష్య నియంత్రణపై ఈ అధికారులు ఇప్పటి నుంచే రంగంలోకి దిగనున్నారు.

Next Story