అది అద్వితీయమైన దేశం.. అందుకే అభిమానం: సీఎం చంద్రబాబు

by Vemula.Srinu Prasad |

శాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సులో సింగపూర్ బృందంతో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ చేసుకుంది..

అది అద్వితీయమైన దేశం.. అందుకే అభిమానం: సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సు(Visakhapatnam CII Partnership Conference)లో సింగపూర్ బృందంతో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ చేసుకుంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సీఎం చంద్రబాబు, సింగపూర్ హోంశాఖ మంత్రి షణ్ముగం సమక్షంలో ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రపంచానికి అభివృద్ధి మోడల్‌గా మారిన సింగపూర్ అంటే తనకు అమితమైన అభిమానం అని చెప్పారు. అత్యంత బలమైన పబ్లిక్ పాలసీలు ఆ దేశంలో అద్భుతమైన అభివృద్ధికి కారణం అయ్యాయన్నారు. లీక్వాన్యూ లాంటి నేతలు సింగపూర్‌ను అద్వితీయమైన దేశంగా మలిచారని తెలిపారు.

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో హైదరాబాద్ అభివృద్ధిలో భాగం అయ్యానని చంద్రబాబు పేర్కొన్నారు. ఇప్పుడు మళ్లీ అమరావతిని నిర్మించే భాగ్యం తనకు కలిగిందన్నారు. మధ్యలో కొన్ని సమస్యలు ఏర్పడినా మళ్లీ పునర్నిర్మాణం ప్రారంభించామని చెప్పారు. రాష్ట్రాన్ని నాలెడ్జి ఎకానమీగా తీర్చిదిద్దుతున్నామని, దేశంలో సుస్థిరమైన ప్రభుత్వం ఉందని వ్యాఖ్యానించారు. గత ఆరు దశాబ్దాలుగా సుస్థిరమైన ప్రభుత్వం సింగపూర్‌లో ఉందని చెప్పారు. బీహార్ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల మద్దతుతో 209 సీట్లను గెలిచిందన్నారు. ప్రధాని మోదీపై , ఎన్డీఏ పై ప్రజలకు ఉన్న విశ్వాసమన్నారు. సింగపూర్ కంపెనీల ఇన్నోవేటివ్ ప్రాజెక్టులకు ఏపీ సిద్ధంగా ఉంటుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Next Story