సింగపూర్‌తో ఎంఓయూ ఓ అద్భుతం: మంత్రి నారా లోకేష్

by Vemula.Srinu Prasad |

విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సులో సింగపూర్ బృందంతో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ ఒప్పందం చేసుకుంది. ...

సింగపూర్‌తో ఎంఓయూ ఓ అద్భుతం: మంత్రి నారా లోకేష్
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సు(Visakhapatnam CII Partnership Conference)లో సింగపూర్ బృందంతో ఏపీ ప్రభుత్వం(AP Govt) ఎంఓయూ ఒప్పందం చేసుకుంది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) మాట్లాడుతూ ఏపీ -సింగపూర్(AP - Singapore) మధ్య కుదిరిన ఎంఓయూ ఓ అద్భుతమైన ప్రయాణానికి నాంది అని తెలిపారు. రెండో ఛాన్స్ ఇచ్చినందుకు సింగపూర్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియచేస్తున్నానని పేర్కొన్నారు. పాలనలో అపారమైన అనుభవం ఉన్న సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఏపీ అభివృద్ధి అని తెలిపారు. సింగపూర్ అభివృద్ది వేగంతో ఏపీ కూడా కలిసి వస్తుందని ఆశిస్తున్నానని మంత్రి లోకేష్ చెప్పారు.

ఈ సందర్బంగా సింగపూర్ విదేశీ వ్యవహారాలు, వాణిజ్యం పరిశ్రమల శాఖ మంత్రి గాన్ సో హాంగ్ మాట్లాడుతూ ఏపీ- సింగపూర్ మధ్య బంధం మరింతగా బలపడాలని కోరుంటున్నానన్నారు. హెల్తీ వెల్తీ హ్యాపీ సొసైటీగా ఏపీ మారాలని సూచించారు. సుస్థిరాభివృద్ధి, డిజిటల్, అర్బన్ గవర్నెన్సు, డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ లో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నామని గాన్ సో హాంగ్ పేర్కొన్నారు.

Next Story