ప్రభుత్వ వైద్యులకు షాకిచ్చిన సర్కార్.. 56 మందికి షోకాజ్ నోటీసులు

by Naga Rani Yarlagadda |

ప్రభుత్వ వైద్యులకు రాష్ట్ర ప్రభుత్వం షాకిచ్చింది. వైద్యారోగ్యశాఖ అనుమతి లేకుండా ఏళ్ల తరబడి విధులకు గైర్హాజరు అవుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

ప్రభుత్వ వైద్యులకు షాకిచ్చిన సర్కార్.. 56 మందికి షోకాజ్ నోటీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ వైద్యులకు రాష్ట్ర ప్రభుత్వం షాకిచ్చింది. వైద్యారోగ్యశాఖ అనుమతి లేకుండా ఏళ్ల తరబడి విధులకు గైర్హాజరు అవుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. విధుల్లో నుంచి తొలగించాలని వైద్యారోగ్యశాఖ నిర్ణయించింది. చివరి అవకాశంగా 56 మందికి షోకాజు నోటీసులు జారీ చేసింది. ఈనెల 12 లోగా డీఎంఈ ఎదుట హాజరై.. విధులకు గైర్హాజరు అవ్వడానికి గల కారణాలను లిఖితపూర్వకంగా వివరించాలని, లేదంటే తొలగిస్తామని డీఎంఈ రఘునందన్ నోటీసుల్లో పేర్కొన్నారు. షోకాజు నోటీసులు అందుకున్న వారిలో 9మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 45 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇద్దరు ట్యూటర్లు ఉన్నారు.

Next Story