తిరుపతిలో జాతీయ ఆయుర్వేద వైద్య సంస్థ.. కేంద్రానికి ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు

by Kema Shiva Kumar |

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే ‘ఆయుష్’ వైద్యానికి ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.

తిరుపతిలో జాతీయ ఆయుర్వేద వైద్య సంస్థ.. కేంద్రానికి ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రాన్ని దేశంలోనే ఆయుష్ వైద్యానికి ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. పురాతన వైద్య విధానాలను ఆధునిక చికిత్సలతో అనుసంధానిస్తూ ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా భారీ ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది. ఆధ్యాత్మిక నగరం తిరుపతిని ‘మెడికల్ హబ్’గా మార్చే ప్రక్రియలో భాగంగా, అక్కడ ఓ జాతీయ ఆయుర్వేద వైద్య సంస్థ (National Institute of Ayurveda) ఏర్పాటు చేయాలని తాజాగా ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఇప్పటికే టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ ఆయుర్వేద కళాశాలను జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేయడం లేదా కొత్తగా కేంద్రం నిధులతో ప్రతిష్టాత్మక సంస్థను నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది.

అమరావతిలో రెండు జాతీయ సంస్థలు..

రాజధాని అమరావతిలో కేంద్ర బడ్జెట్ 2026 కేటాయింపులకు అనుగుణంగా రెండు జాతీయ స్థాయి వైద్య పరిశోధనా సంస్థల ఏర్పాటుకు ప్రభుత్వం స్థలాలను కేటాయించింది. అమరావతిలో నిర్మించబోయే ‘హెల్త్ సిటీ’లో భాగంగా ఈ సంస్థలు పనిచేయనున్నారు. ఇవి అత్యాధునిక పరిశోధనలు (Research), ఉన్నత వైద్య విద్యను కూడా అందించనున్నాయి.

Next Story