Breaking: ఏపీ ప్రభుత్వ కార్యక్రమం వాయిదా

by Vemula.Srinu Prasad |

ఏపీ ప్రభుత్వ కార్యక్రమం వాయిదా పడింది.

Breaking: ఏపీ ప్రభుత్వ కార్యక్రమం వాయిదా
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వం(Ap Government) కార్యక్రమం వాయిదా పడింది. కూటమి పాలన ఏడాది అయిన సందర్భంగా మరికొద్దిసేపట్లో విజయోత్సవ వేడుకలు నిర్వహించాలని ఏర్పాటు చేసింది. అయితే అహ్మదాబాద్ ఫ్లైట్ ప్రమాదం(Ahmedabad flight accident) కారణంగా వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సీఎం చంద్రబాబు(Cm Chandrababu) నివాసంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ వేడుకలను శుక్రవారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

కాగా కూటమి పాలన ఏడాది పాలన పూర్తి సందర్భంగా విజయవాడలోని ప్రైవేటు కన్వెన్షన్ సెంటర్‌లో విజయోత్సవ వేడుకలు నిర్వహించేందుకు సర్వంసిద్ధం చేశారు. అతిరథ మహారధులకు ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌(Deputy Cm Pawan Kalyan)తో పాటు కూటమి నేతలు సైతం పాల్గొననున్నారు. అకస్మాత్తుగా అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం జరగడంతో కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఈ మేరకు అధికారులకు సమాచారం అందజేశారు.

Next Story