ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. "అసైన్డ్" భూముల నుంచి ఆ పదాన్ని తొలగిస్తూ జీఓ

by Naga Rani Yarlagadda |

ఏపీ రాజధాని అమరావతి (Amaravati) నిర్మాణానికి అసైన్డ్ భూములు (Assigned Lands) ఇచ్చిన రైతులకు ఊరటనిస్తూ.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. అసైన్డ్ భూముల నుంచి ఆ పదాన్ని తొలగిస్తూ జీఓ
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ రాజధాని అమరావతి (Amaravati) నిర్మాణానికి అసైన్డ్ భూములు (Assigned Lands) ఇచ్చిన రైతులకు ఊరటనిస్తూ.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అసైన్డ్ భూములు అనే పదాల్లో అసైన్డ్ అనే వర్డ్ ను తొలగించాలని పేర్కొంటూ.. సీఎం చంద్రబాబు (CM Chandrababu Naidu) కీలక ఆదేశాలు జారీ చేశారు. రిటర్నబుల్ ప్లాట్లలో అసైన్డ్ అనే పదాన్ని తొలగించాలని సూచించారు. అందుకు బదులుగా పట్టా భూమి అని పేర్కొనాలని తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీఓ నంబర్ 187ను జారీ చేసింది. ల్యాండ్ పూలింగ్ చట్టంలో 9.24 లోని కాలం నంబర్ 7, రూల్ నంబర్ 11(4) క్లాజ్ ను మారుస్తూ ఈ జీఓ జారీ అయింది. దీంతో ఇకపై అసైన్డ్ భూమిలో రిటర్నబుల్ ప్లాట్ వస్తే ఆ భూమిని పట్టా భూమిగా పరిగణించాలి. దీనివల్ల రైతులు ఇకపై తమ భూములను దర్జాగా అమ్ముకునే వెసులుబాటు కలుగుతుంది. ఇప్పటి వరకూ అసైన్డ్ భూమి అని ఉండటంతో తమ ప్లాట్లు అమ్ముడుపోవడం లేదని రైతులు ప్రభుత్వానికి తమ గోడు వెలిబుచ్చగా.. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Next Story