Ap: పేదలకు గుడ్ న్యూస్.. ఉగాది నుంచి సరికొత్త కార్యక్రమం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-02-27 14:43:28  IST  )

ఏపీ ప్రభుత్వం సరికొత్త కార్యక్రమాలతో దూసుకుపోతోంది...

Ap: పేదలకు గుడ్ న్యూస్.. ఉగాది నుంచి సరికొత్త కార్యక్రమం
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వం(AP Govt) సరికొత్త కార్యక్రమాలతో దూసుకుపోతోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వినూత్నమైన పాలన సాగిస్తోంది. ఎన్నికల హామీల్లో చెప్పిన విధంగా వివిధ పథకాలను ప్రవేశ పెట్టింది. ప్రజలకు ప్రభుత్వ సేవలు సులభతరం చేస్తూ వాట్సాప్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. కూటమి ప్రభుత్వం ఇప్పుడు మరో సరికొత్త కార్యక్రమానికి త్వరలోనే శ్రీకారం చుట్టనుంది. ఇందుకు ఉగాది పండుగ(Ugadi Festival)నుని ఎన్నుకుంది. తెలుగువారి పండుగ సందర్భంగా పేదలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా పీ4 సేవలు అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు.

ఈ మేరకు ఉగాది నుంచి Public-Philanthropic-people-participation కార్యక్రమాన్ని అమలు చేసేందుకు కసరత్తులు మొదలుపెట్టారు. ప్రస్తుతం పేదలకు ప్రభుత్వం ఎన్నో పథకాలు అందిస్తోంది. అదనంగా ఈ పీ4లో ఉన్న వారికి కూడా చేయూత నివ్వనుంది ప్రభుత్వం. ముందుగా 4 గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనుంది. మొత్తం 5,869 కుటుంబాలకు లబ్ధి చేసే ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. పేదల సాధికారత, ఆర్థికంగా బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని సీఎం చంద్రబాబు(Cm Chandrababu Naidu) స్పష్టం చేశారు.

Next Story