- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AP: పదో తరగతి ఇంగ్లీష్ పరీక్ష వాయిదా..కొత్త తేదీ ఖరారు !
పదో తరగతి ఇంగ్లీష్ పరీక్ష వాయిదా పడింది. ఇంగ్లీష్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ఏపీ సర్కార్ అధికారిక ప్రకటన చేసింది.

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదో తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్. పదో తరగతి ఇంగ్లీష్ పరీక్ష వాయిదా పడింది. ఈ మేరకు ఇంగ్లీష్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ఏపీ సర్కార్ అధికారిక ప్రకటన చేసింది. రంజాన్ పండుగ నేపథ్యంలో ఈ నెల 21వ తేదీన గవర్నమెంట్ హాలిడే వచ్చింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 20వ తేదీన ప్రభుత్వ హాలిడే ఉండేది. కానీ ఏపీలోని మత పెద్దలు మార్చి 21వ తేదీన రంజాన్ పండుగ అని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే శనివారం రోజున పబ్లిక్ హాలిడే ఇచ్చింది ఏపీ సర్కార్.
ఏప్రిల్ 2వ తేదీన వాయిదా పడిన పరీక్ష
దీంతో ఆ రోజున జరగాల్సిన ఇంగ్లీష్ పరీక్షను వాయిదా వేశారు. ఇక వాయిదా పడిన ఇంగ్లీష్ పరీక్ష, ఏప్రిల్ రెండవ తేదీన ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 గంటల వరకు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది సర్కార్. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక ఏప్రిల్ రెండవ తేదీన ఇంగ్లీష్ పరీక్ష నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. అదే సమయంలో ఇంటర్ ఫస్టియర్ ఐపీఈ పరీక్ష ఈ నెల 21వ తేదీ నుంచి 25వ తేదీకి కూడా వాయిదా వేశారు. అటు శుక్రవారం రోజున ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా నడుస్తాయి.






