- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సర్కార్ కీలక నిర్ణయం..ఆ రోజున కూడా బ్యాంకులకు సెలవు !
ఏపీలో ఈనెల 16వ తేదీన కూడా బ్యాంకులకు సెలవు ఉండనుంది. ఈనెల 16వ తేదీన కనుమ పండుగ ఉన్న సంగతి తెలిసిందే. అదే రోజున కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బ్యాంకులు, వాటి అనుబంధ సంస్థలకు ప్రభుత్వం హాలిడే ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్. ఏపీలో ఈనెల 16వ తేదీన కూడా బ్యాంకులకు సెలవు ఉండనుంది. ఈనెల 16వ తేదీన కనుమ పండుగ ఉన్న సంగతి తెలిసిందే. అదే రోజున కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బ్యాంకులు, వాటి అనుబంధ సంస్థలకు ప్రభుత్వం హాలిడే ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. వాస్తవంగా బ్యాంకులకు సర్కార్ ఇచ్చిన సెలవుల జాబితాలో జనవరి 16వ తేదీన సెలవు లేదన్న సంగతి తెలిసిందే.
కానీ ఏపీలో జనవరి 16వ తేదీన కనుమ పండుగ చాలా గ్రాండ్ గా చేస్తారు. ఈ తరుణంలో బ్యాంకు సంఘాల విన్నపం మేరకు తాజాగా సెలవు ఇస్తూ నిర్ణయం తీసుకుంది సర్కార్. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు సీఎస్ విజయానంద్. అదే సమయంలో ఐదు వర్కింగ్ డేస్ కోసం ఈనెల 27వ తేదీన పలు బ్యాంకుల ఉద్యోగులు సమ్మెకు దిగబోతున్నారు. ఈ మేరకు ఇప్పటికే సమ్మె నోటీసు కూడా ఇచ్చాయి ఉద్యోగుల సంఘాలు. మరి దీనిపై కేంద్ర సర్కార్ ఎలా స్పందిస్తుందో చూడాలి.






