- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉమెన్స్ డే సందర్భంగా గుడ్ న్యూస్.. ఆ రెండు పథకాలపై ప్రభుత్వం కీలక ప్రకటన
జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది.....

దిశ, వెబ్ డెస్క్: జాతీయ మహిళా దినోత్సవం(National Womens Day) సందర్భంగా మహిళలకు ఏపీ ప్రభుత్వం(Ap Government) గుడ్ న్యూస్ తెలిపింది. ఎన్నికల హామీల్లో భాగంగా ఫ్రీ బస్ జర్నీ(Free Bus Journey)పై మంత్రి నారాయణ(Minister Narayana) కీలక ప్రకటన ప్రకటన చేశారు. త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. అలాగే మే నెలలో తల్లివందనం పథకం అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఈ స్కీమ్ కింద ప్రతి విద్యార్థికి రూ. 15 వేలు తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని పేర్కొన్నారు. మహిళల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోందని నారాయణ తెలిపారు.
మహిళలను ఆర్థికంగా పైకి తీసుకురావాలనే కూటమి ప్రభుత్వ ధ్యేయమని నారాయణ చెప్పారు. ఇప్పటికే సంవత్సరానికి మూడు సిలిండర్లకు ఉచితంగా ఇస్తున్నామని గుర్తు చేశారు. ఆస్తిలో సగభాగం మహిళలకు ఇచ్చింది టీడీపీ(Tdp) అని గుర్తు చేశారు. అలాగే స్థానిక సంస్థలలో సైతం రిజర్వేషన్లు ఇచ్చామని నారాయణ పేర్కొన్నారు. గత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు అప్పులు చేసిందని, ప్రస్తుతం రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయిందని చెప్పారు. మున్సిపాలిటీల్లో బ్లీచింగ్‌కి కూడా డబ్బులు లేవని మంత్రి నారాయణ తెలిపారు.






