AP Govt : నాయీ బ్రాహ్మణులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

by Muthe.Rajitha |

నాయీ బ్రాహ్మణుల(Nayi Brahmins)కు ఏపీ ప్రభుత్వం(AP Govt) భారీ గుడ్ న్యూస్ తెలిపింది.

AP Govt : నాయీ బ్రాహ్మణులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
X

దిశ, వెబ్ డెస్క్ : నాయీ బ్రాహ్మణుల(Nayi Brahmins)కు ఏపీ ప్రభుత్వం(AP Govt) భారీ గుడ్ న్యూస్ తెలిపింది. ఆలయాల్లో నాయీ బ్రాహ్మణులకు ఇచ్చే కమిషన్ ను పెంచుతూ(Commission Increase) ఉత్తర్వులు విడుదల చేసింది. ఆలయాల్లో విధులు నిర్వహించే నాయీ బ్రాహ్మణులకు ఇది వరకు రూ.20 వేలు కమిషన్ ఇస్తుండగా.. దానిని రూ.25 వేలకు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. 6ఏ కేటగిరీలో 44 దేవాలయాల్లో పనిచేస్తున్న వారికి ఈ పెంపు వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే వారు కనీసం 100 రోజుల పాటైనా ఆలయాల్లో సేవలు అందించి ఉండాలని తెలిపింది.

ఏడాదికి రూ.50 లక్షల నుంచి రూ.2 కోట్ల ఆదాయం వచ్చే ఆలయాలు 6ఏ కేటగిరీలోకి వస్తాయి. ఆలయాలకు భారీగా ఆదాయం వస్తున్నప్పటికీ తమకు అతి తక్కువ కమిషన్ మాత్రమే ఇస్తున్నారని, దానిని పెంచాలని ఎప్పటి నుంచో నాయీ బ్రాహ్మణులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నేడు ఈ కీలక నిర్ణయం తీసుకుంది. కాగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై నాయీ బ్రాహ్మణ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

Next Story