- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దివ్యాంగ స్టూడెంట్స్ కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
దివ్యాంగ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది.

దిశ, వెబ్ డెస్క్ : దివ్యాంగ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న దివ్యాంగ స్టూడెంట్స్ మినహాయింపు పొందిన పేపర్లకు సగటు మార్కులు కల్పిస్తున్నట్టు ఇంటర్ విద్యాశాఖ ప్రకటించింది. వారు మినహాయింపు పొందిన పేపర్ కు ఇకపై సగటు మార్కులు ఇవ్వనున్నారు. అయితే వీరు రెండు భాషా పరీక్షల్లో ఏదోకటి మాత్రమే రాసి, మరొక దానికి మినహాయింపు పొందే అవకాశం ఉంది. వారు హాజరయ్యే 5 పేపర్లలో నాలుగింటికి మార్కులు వేసి, మినహాయింపు పొందిన పేపర్ కు మాత్రం 'E' అని సర్టిఫికెట్లో పొందుపరిచేవారు.
అయితే ఇలాంటి సర్టిఫికెట్లతో IIT, NIT లలో అడ్మిషన్లు నిరాకరిస్తుండగా.. దివ్యాంగులు ఇబ్బంది పడేవారు. గతేడాది ఈ సమస్యపై IIT, NIT లకు స్వయంగా ఏపీ మంత్రి నారా లోకేష్ ఫోన్ చేసి మాట్లాడాల్సి వచ్చింది. దీనిని దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది నుంచి దివ్యాంగులు మినహాయింపు పొందిన పేపర్ కు సగటు మార్కులు కేటాయించనున్నారు.






