- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'కింగ్డమ్' టికెట్ ధరల పెంపుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
by Yella Dhawani Reddy |
డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'కింగ్డమ్ (Kingdom)'.

X
దిశ, వెబ్ డెస్క్: డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'కింగ్‌డమ్ (Kingdom)'. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత నాగవంశీ నిర్మిస్తున్నారు. భారీ అంచనాల మధ్య రూపొందిన ఈ యాక్షన్ డ్రామా జూలై 31న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'కింగ్‌డమ్' చిత్రానికి ప్రత్యేక టికెట్ ధరల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినిమా విడుదలైన మొదటి 10 రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకోవచ్చని అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.50, మల్టీప్లెక్స్‌లలో రూ.75 వరకూ పెంచుకునే అవకాశం కల్పించారు. ఈ నిర్ణయం నిర్మాతలకు ఆర్థికంగా ఉపశమనం కలిగించనుంది. మరోవైపు టికెట్ ధరల పెంపుపై చిత్రయూనిట్ తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా కోరినట్లు సమాచారం.
Next Story






