మొంథా బాధిత చేనేతలకు ఏపీ ప్రభుత్వ భరోసా

by Thanuru Gopichand |   (  Updated:2025-11-03 02:51:47  IST  )

మొంథా తుఫాను (Montha Cyclone) కారణంగా నష్టపోయిన చేనేతలకు ఏపీ ప్రభుత్వం భరోసా కల్పిస్తోంది.

మొంథా బాధిత చేనేతలకు ఏపీ ప్రభుత్వ భరోసా
X

దిశ, వెబ్ డెస్క్ : మొంథా తుఫాను (Montha Cyclone) కారణంగా నష్టపోయిన చేనేతలకు ఏపీ ప్రభుత్వం భరోసా కల్పిస్తోంది. తుఫాను కారణంగా నష్టపోయిన నేతన్నకు నష్టపరిహారాన్ని ప్రకటించింది. నూలు, రంగులు, రసాయనాలు నష్టపోయిన వారికి రూ.5వేలను ఇవ్వనుంది. వర్షాల కారణంగా ఉపాధి కోల్పోయిన చేనేత కార్మిక కుటుంబాలకు 50 కేజీల బియ్యం, లీటర్ పామాయిల్, కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, కేజీ పంచదార లెక్కన నిత్యావసరాలు పంపిణీ చేయనుంది.

వివరాలు వెల్లడించిన మంత్రి సవిత..

ఈ మేరకు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత (Minister S Savitha) వివరాలను వెల్లడించారు. ఇటీవల తుఫాను కారణంగా రైతులతో పాటు నేతన్నలు కూడా నష్టపోయారన్నారు. వారి కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 27,982 మంది చేనేత కుటుంబాలు బాధితులుగా మారినట్లు గుర్తించామన్నారు. 718 మందికి చెందిన నూలు, రంగులు, రసాయనాలు వంటి ఇతర వస్తువులు నీటిలో తడిచిపోయాయన్నారు. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 4,278 కుటుంబాలు, కృష్ణాలో 3,900 కుటుంబాలు, శ్రీకాకుళంలో 3,333 కుటుంబాలు, నెల్లూరులో 2,400 కుటుంబాలు, తిరుపతి జిల్లాలో 1700 కుటుంబాలు తుఫాను వల్ల నష్టపోయాయని తెలిపారు.

Next Story