సమాజసేవను శిక్షగా విధించే విధివిధానాలు ఆమోదిస్తూ ఉత్తర్వులు

by Naga Rani Yarlagadda |

సమాజంలో సేవ చేయడాన్ని కూడా ఒక శిక్షగా విధించే విధివిధానాలకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

సమాజసేవను శిక్షగా విధించే విధివిధానాలు ఆమోదిస్తూ ఉత్తర్వులు
X

దిశ, వెబ్ డెస్క్: సమాజంలో సేవ చేయడాన్ని కూడా ఒక శిక్షగా విధించే విధివిధానాలకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను ఆమోదిస్తూ.. రాష్ట్ర హోంశాఖ జీఓ ఇచ్చింది. ఇకపై నేరతీవ్రతను బట్టి నేరస్తులకు న్యాయస్థానాలు ఈ శిక్షలు విధించనున్నాయి. ఒకరోజు నుంచి 31 రోజుల వరకూ కోర్టులు సమాజసేవ శిక్షలు విధించే అవకాశం ఉంది. రోజులతో పాటు.. గంటల చొప్పున కూడా సమాజసేవ శిక్షల్ని విధించే అవకాశం కూడా ఉంది. నేరస్తులకు ఆస్పత్రులు, మున్సిపాలిటీలు, జూ, పబ్లిక్ పార్కులు, ట్రాఫిక్ నియంత్రణ సేవలు, ప్రభుత్వ పాఠశాలలు, గ్రంథాలయాల్లో సేవలను కూడా శిక్షలుగా విధించే ఛాన్స్ ఉంది.

Next Story