అమరావతి క్వాంటమ్‌ వ్యాలీ డిక్లరేషన్‌ను ఆమోదించిన ప్రభుత్వం

by Naga Rani Yarlagadda |

అమరావతి క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్ (Amaravati Quantum Valley Declaration)కు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

అమరావతి క్వాంటమ్‌ వ్యాలీ డిక్లరేషన్‌ను ఆమోదించిన ప్రభుత్వం
X

దిశ, వెబ్‌డెస్క్: అమరావతి క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్ (Amaravati Quantum Valley Declaration)కు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విజయవాడలో జూన్ 30వ తేదీన క్వాంటమ్ వ్యాలీ వర్క్ షాప్ లో చేసిన డిక్లరేషన్ కు ఆమోదం లభించింది. ఈ మేరకు ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. క్వాంటమ్ గేట్ వే హబ్‌ను డెవలప్ చేయడమే లక్ష్యంగా.. అమరావతి క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్‌ను రూపొందించారు. క్వాంటమ్ పరిశోధన, ఆవిష్కరణ, అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ భాగస్వామ్యాలకు ప్రాధాన్యమివ్వనున్నట్లు వెల్లడించారు. 2035 నాటికి ప్రపంచ క్వాంటమ్ కేంద్రంగా అమరావతిని అభివృద్ధి చేయడమే దీని లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. 2026లో ప్రారంభమయ్యే అమరావతి క్వాంటమే అకాడమీ ద్వారా శిక్షణ, ఫెలో షిప్‌లు అందజేయాలని నిర్ణయించుకున్నారు.

Next Story